: వివాదంలో పడిన అజహరుద్దీన్ వెండితెర కథ!


టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా వివాదంలో పడింది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే 'అజార్' జీవితాన్ని ఎంతో మంది ప్రభావితం చేశారు. హైదరాబాదులో గల్లీ క్రికెటర్ గా జీవితం ప్రారంభించిన అజహరుద్దీన్ మణికట్టు మాయాజాలంతో విభిన్నమైన క్రికెటర్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. వరుస సెంచరీలతో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అజహరుద్దీన్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. దీంతో ఆయన అనుమతితో ఆయన జీవిత కథను సినిమాగా శోభాకపూర్, ఏక్తాకపూర్ తెరకెక్కించారు. 'అజార్' సినిమా ఈ నెల 13న విడుదలకు సిద్ధమైంది. ఇంతలో అజహరుద్దీన్ జీవితాన్ని మలుపులు తిప్పిన మనోజ్ ప్రభాకర్, రవిశాస్త్రి, నవ్ జోత్ సింగ్ సిద్ధూ, కపిల్ దేవ్ లు రంగప్రవేశం చేశారు. ఈ సినిమాలో తమ పాత్రలను ఎలా చిత్రీకరించారో చూపించాలంటూ ప్రివ్యూ వేయాలని నిర్మాతను కోరారు. అందుకు నిర్మాత అంగీకరించడం లేదు. ఇకపోతే ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర 'అజార్' రెండో భార్య సంగీతా బిజ్ లానీ తన పాత్రను నెగిటివ్ గా చూపించారని అనుమానిస్తోంది. దీంతో వీరంతా కోర్టుకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News