: విద్యుదాఘాతం నుంచి మహిళను రక్షించబోయి తండ్రీకొడుకుల మృతి
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న తీగలపై బట్టలు ఆరవేస్తోన్న ఓ మహిళ చెయ్యి విద్యుత్ తీగకు తగిలి షాక్కు గురయింది. అక్కడే ఉన్న తండ్రీకొడుకులు యాదయ్య(60), రాజు(23) ఆ మహిళను రక్షించే ప్రయత్నంలో తమ ప్రాణాలను కోల్పోయారు. విద్యుదాఘాతానికి గురయిన మహిళను తాకడంతో యాదయ్య, రాజులకు కూడా షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఘటనతో యాదయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.