: మోదీ మాటకు జైకొట్టిన అశోక్ గజపతి రాజు!... ట్విట్టర్ లో చేరిన కేంద్ర మంత్రి


‘సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. ట్విట్టర్ లో కనీసం లక్ష మంది పాలోయర్లు ఉండాల్సిందే’ అని ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం చేసిన సూచనకు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రుల మాటేమో తెలియదు కానీ... టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాత్రం వేగంగా స్పందించారు. ప్రధాని సూచన చేసిన మరునాడే గజపతిరాజు దానిని అమల్లోకి పెట్టేశారు. అప్పటిదాకా ట్విట్టర్ ఖాతా లేని గజపతిరాజు... నిన్న ట్విట్టర్ ఖాతా తెరిచారు. ‘ప్రస్తుత ప్రపంచంలో పరస్పర సంప్రదింపులకు, సంభాషణలకు ట్విట్టర్ బాగా ఉపయోగపడుతుంది’ అని ఈ సందర్భంగా ఆయన తన తొలి ట్వీట్ ను పోస్ట్ చేశారు. ఇక ట్విట్టర్ లో చేరిన మరుక్షణమే తనకు వచ్చిన ఓ ఫిర్యాదుపై స్పందించిన గజపతిరాజు... దానిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News