: నేను పుట్టగానే హీరోగా పారితోషికం తీసుకున్నాను: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్
తాను పుట్టిన వెంటనే హీరోగా పారితోషికం తీసుకున్నానని ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ తనయుడు, యువ హీరో అయిన టైగర్ ష్రాఫ్ చెప్పాడు. ‘నేను పుట్టిన తర్వాత నన్ను చూసేందుకు వచ్చిన దర్శకుడు సుభాష్ ఘాయ్ అంకుల్ రూ.21,000 నగదును నాన్నకు ఇచ్చారట. నన్ను చూడడానికి వచ్చిన ఆయన అప్పుడే నన్ను తన సినిమాలో తీసుకోవాలనుకున్నారు. కనుక, ఘాయ్ కి నేను రుణపడి ఉన్నాను, ఆయనతో కలిసి తప్పకుండా సినిమా చేస్తాను’ అని టైగర్ ష్రాఫ్ తన మనసులో మాట చెప్పాడు.