: నాగార్జున యూనివర్శిటీ క్యాంపస్ బ్యాంకులో దొంగనోట్ల కలకలం


ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ)లో నకిలీనోట్ల సంఘటన కలకలం రేపింది. ఏఎన్ యూలో విద్య నభ్యసిస్తున్న ఇరాక్ విద్యార్థి కరీంసాల్, క్యాంపస్ లోని బ్యాంకు ఖాతాలో రూ.98 వేలు జమ చేశాడు. అందులో రూ.38 వేలు నకిలీనోట్లుగా బ్యాంకు అధికారులు గుర్తించారు. కాగా, ఈ విషయమై బ్యాంకు అధికారులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. ఇరాక్ లోనే తనకు ఈ నకిలీ కరెన్సీ లభించిందని కరీం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News