: మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా... మంత్రి సహా ఐదుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కారు బోల్తా పడింది. చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గేట్ దాటి ఖాజా టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టింది. దీంతో మంత్రి రవీంద్ర, ఆయన పీఏ, డ్రైవర్ మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిన హుటాహుటీన తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.