: 'ది రాక్ క్లాక్' యాప్ తో ఫిట్ నెస్ ప్రారంభించమంటున్న డ్వెయిన్ జాన్సన్


పడుకునేముందు 'రేపు తెల్లారి లేవగానే వ్యాయామం మొదలుపెడదాం' అనుకుని నిద్రపోయి, పొద్దున్న స్మార్ట్ ఫోన్ లో అలారం మోగగానే, బద్ధకంతో స్నూజ్ చేసి నిద్రపోతారు చాలా మంది. దీనికి పరిష్కారంగా హాలీవుడ్ కందల వీరుడు డ్వెయిన్ జాన్సన్ 'ది రాక్ క్లాక్' పేరిట ఓ యాప్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చాడు. ఈ యాప్ కు స్నూజ్ ఆప్షన్ లేదు. దీంతో దానిని ఒకసారి సెట్ చేసి నిద్రకు ఉపక్రమిస్తే లేచి దానిని ఆఫ్ చేయాల్సిందే. ఇలా లేవడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా నిద్రకు స్వస్తి చెబుతారని డ్వెయిన్ జాన్సన్ అంటున్నాడు. ఈ క్లాక్ లో ఫిట్ నెస్ లో అందుకోవాల్సిన లక్ష్యాలు ఫీడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ లక్ష్యాలు సాధించేందుకు డ్వెయిన్ జాన్సన్ చెప్పిన ఉత్తేజభరిత మాటలు కూడా ఫీడ్ చేశారు. దీనికి తోడు డ్వెయిన్ జాన్సన్ అప్పుడప్పుడు తన మెసేజ్ లు కూడా పంపుతాడు. 'ది రాక్ క్లాక్' యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో మాత్రమే అందుబాటులో ఉంది.

  • Loading...

More Telugu News