: తమ ప్రధాని ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది: ఢిల్లీ వర్సిటీకి కేజ్రీ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలని, ఆ వివరాలు ప్రజలకు అందుబాటుగా వెబ్‌సైట్‌లోనూ ఉంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీకి లేఖ రాశారు. అంతేగాక, మోదీ డిగ్రీ వివరాలను యూనివర్సిటీ భద్రంగా ఉంచాలని లేఖలో సూచించారు. మోదీ డిగ్రీ వివరాలను తెలిపే పత్రాలు వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాలని పేర్కొన్నారు. దేశ ప్రజలకు తమ ప్రధాని ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకునే హక్కు ఉందని అన్నారు. ప్రధాని డిగ్రీ అంశంపై పలు ఆరోపణలు వస్తోన్న దృష్ట్యా వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఒక వేళ మోదీ బీఏ పట్టభద్రుడు కాకపోతే, ఎంఏ డిగ్రీని ఎలా చేస్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మోదీ దగ్గర నకిలీ ఎంఏ డిగ్రీ ఉందన్న అనుమానాలకు తావిస్తుందని తెలిపారు.