: ఆమె ఆల్కహాలిక్ కాదు... నేను అమ్మాయిల పిచ్చోడిని కాదు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్


‘ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను అమ్మాయిల పిచ్చోడిని కాదు. విడిపోవడమనేది సాధారణమే. అది దురదృష్టకరమే’ అని బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అన్నాడు. టీవీ నటి అంకిత లోఖాండేతో తన ప్రేమకు స్వస్తి చెప్పిన నేపథ్యంలో సుశాంత్ ఈ ట్వీట్ చేశాడు. ఈ ప్రేమజంట పెళ్లి చేసుకుంటుందని మొన్నటివరకు అందరూ అనుకున్నారు. కానీ, తాము విడిపోయామంటూ సుశాంత్ చేసిన ఈ ట్వీట్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, టీమిండియా క్రికెటర్ ధోనీ జీవిత చరిత్రతో రూపొందుతున్న ‘ఎంఎస్ ధోనీ’ చిత్రంలో టైటిల్ రోల్ ను సుశాంత్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News