: మాల్యా చెక్‌ బౌన్స్‌ కేసు ఈనెల 9కి వాయిదా.. 15 చెక్ బౌన్స్ కేసుల్లో నిందితుడ‌ని వెల్లడించిన న్యాయవాది


శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చెల్లింపుల విషయంలో జీఎంఆర్‌ గ్రూప్‌ సంస్థకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇచ్చిన‌ చెక్‌ బౌన్స్‌ కావడంతో ఆ గ్రూప్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విష‌యం విధిత‌మే. ప్ర‌స్తుతం విదేశాల్లో తలదాచుకుంటోన్న మాల్యాపై ఈ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు జారీ అయింది. కేసును ఈరోజు విచారించిన హైదరాబాదులోని ఎర్ర‌మంజిల్ కోర్టు తదుప‌రి విచార‌ణ‌ను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విష‌యంలో మాల్యా దేశానికి వ‌చ్చి విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌నే న‌మ్మ‌కం త‌మ‌కు లేద‌ని జీఎంఆర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు విన్న‌వించారు. విజ‌య్ మాల్యా ఏకంగా 15 చెక్ బౌన్స్ కేసుల్లో నిందితుడ‌ని తెలిపారు. 22.5 కోట్ల రూపాయ‌ల చెక్‌ బౌన్స్ లు జ‌రిగాయ‌ని న్యాయ‌వాది పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News