: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మంది సిబ్బందిపై వేటు


గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో 15 మంది సిబ్బందిపై వేటు పడింది. బాలింతల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న పదిహేను మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈమేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సదరు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, జీజీహెచ్ లో కాన్పుల గది సిబ్బంది ఆగడాలను తట్టుకోలేక ఏకంగా 12 మంది బాలింతలు ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓకు రాతపూర్వకంగా ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడుతున్న వారిపై వేటు పడినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News