: రిషికేశ్ లో బ్రిటన్ జంటపై అటవీశాఖ సిబ్బంది దాడి


ఒక విదేశీ జంటపై అటవీ శాఖ దాడి చేసిన సంఘటన ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పులుల సంరక్షణా కేంద్రం పరిధిలో ఉన్న మహేశ్ యోగీ ఆశ్రమాన్ని దర్శించేందుకని గత సోమవారం బ్రిటన్ జంట ఇక్కడికి వచ్చింది. ప్రవేశ రుసుం విషయమై అటవీ శాఖ సిబ్బందికి, విదేశీ జంటకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రవేశ రుసుం రూ.600 అని అటవీశాఖ సిబ్బంది చెప్పగా, అది చాలా ఎక్కువని వారు అన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన ఘర్షణ వివాదంగా మారడంతో అటవీ శాఖ సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని బ్రిటన్ జంట ఆరోపణల మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనను బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి ఆ జంట తీసుకువెళ్లినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News