: జరిమానా పడింది.. వివాదాస్పద ప్రవర్తనకు గంభీర్ కు, స్లో ఓవర్ రేట్‌కు కోహ్లీకి
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ లో భారీ జరిమానాకు గురయ్యారు. ఐపీఎల్-9 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య సోమవారం మ్యాచు జరిగింది. దీనిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన ఆనందంలో గంభీర్ అక్కడి కుర్చీలను తన్నాడు, అంతేగాక వివాదాస్పదంగా ప్రవర్తించాడు. దీంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధింపునకు గురయ్యాడు. మరో వైపు కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధింపునకు గురయ్యాడు. స్లో ఓవర్ రేట్‌తో కోహ్లీ సహా మొత్తం జట్టు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.