: పనామా పేపర్స్ లో బాలీవుడ్ జంట పేర్లు
విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను బయటపెడుతున్న ‘పనామా పేపర్స్’ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల బాలీవుడ్ కు చెందిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్ తదితరుల పేర్లను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, మరికొంత మంది పేర్లను బయటపెట్టింది. అందులో బాలీవుడ్ హీరో హీరోయిన్లు, దంపతులు అయిన అజయ్ దేవగణ్, కాజోల్ పేర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, బ్రిటిష్ ఐలాండ్స్ లో మార్లీ బోన్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ కొనుగోలు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే ఏర్పాటైందని పేర్కొన్నారు.