: ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి: మురళీ మోహన్
ప్రఖ్యాత సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం అందజేయాలని లోక్ సభలో టీడీపీ ఎంపీ మురళీమోహన్ గళమెత్తారు. సినీ నటుడిగా రాణించిన ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఆనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వినూత్నమైన రీతిలో ప్రజాసంక్షేమానికి పథకాలు చేపట్టి, అద్భుతమైన సేవలు అందించారని ఆయన తెలిపారు. దేశానికి గర్వకారణమైన ఎన్టీఆర్ ను మరణానంతరమైనా భారతరత్నతో గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.