: తుమ్మలకు దమ్ముంటే అన్ని పదవులకు రాజీనామా చేసి గెలుపొందాలి: ఉత్తమ్ సవాలు


తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దమ్ముంటే ఎమ్మెల్సీ, మంత్రి పదవులకి రాజీనామా చేసి, పాలేరు ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో సమస్యలపై ఎన్ఎస్ యూఐ పోరాడాలని అన్నారు. యూనివర్సిటీల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ విద్రోహశక్తిలా తయారైందని ఆయన ఆరోపించారు. కాగా, పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News