: పొత్తు కోసం టీడీపీని దేబిరించడం లేదు... ఇచ్చిన నిధులకు లెక్క చెప్పండి: చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే


ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం తామేమీ దేబిరించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీకి ఇప్పటివరకూ కేంద్రం ఎన్నో నిధులను ఇవ్వగా, వాటిని ఏ విధంగా వాడారన్న విషయాన్ని చెప్పడం లేదని విమర్శించారు. నిధులను ఎలా వినియోగించారన్న విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని విమర్శిస్తే, మంత్రి పదవులు పొందవచ్చన్న ఆశతో కొందరు ఎమ్మెల్యేలు అదే పనిగా పెట్టుకుని నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తు కోసం తాము పాకులాడటం లేదని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని అన్నారు.

  • Loading...

More Telugu News