: ఇండియాపై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు.. ఎన్నో విషయాల్లో అన్యాయం చేస్తోందని ఆరోపణ
ప్రచార సభల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ అమెరికా అధ్యక్ష పదివికి పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై పలు వ్యాఖ్యలు చేశారు. తమ దేశీయుల ఉద్యోగాలను తన్నుకుపోతూ ఇండియా తమకు అన్యాయం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇండియాతో పాటు చైనా, వియత్నాం, జపాన్ ఎన్నో విషయాల్లో అమెరికాకు నష్టం కలగజేస్తున్నాయంటూ ఆరోపించారు. అయితే తనకు ఇతర దేశాలపై కోపం, వ్యతిరేకత లేవన్నారు. ఓ వైపు ఇండియాపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు కాసేపట్లో పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్‌గా ఇండియాను అభివర్ణించారు. ఒబామా అనుసరిస్తోన్న విధానాలు తమ దేశానికి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని విమర్శించారు. వేరే దేశాలనుంచి యువత తమ దేశానికి వచ్చి ఇక్కడి ఉద్యోగాలను కొట్టేయడమేంటంటూ ఆయన ప్రశ్నించారు.