: తమ యుద్ధ విమానాలు కొనుక్కోవడానికి పాక్ కు రుణం కూడా ఇస్తోన్న అమెరికా!


పాకిస్థాన్ కు 8 ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించుకున్న అమెరికా, విమానాల కొనుగోలుకు అవసరమయ్యే నిధులను కూడా రుణం రూపంలో ఇస్తామని వెల్లడించింది. లాక్ హీడ్ మార్టిన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ జెట్ యుద్ధ విమానాలను, రాడార్లు, ఇతర పరికరాలను పాక్ కు అమ్మేందుకు 699 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని అమెరికా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ డీల్ ను పూర్తి చేసేందుకు పాక్ వద్ద చాలినన్ని నిధులు లేకపోవడంతో ఒబామా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరఫున పాక్ కు రుణమిచ్చి డీల్ కు సహకరించాలని నిర్ణయించింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పాక్ కు విమానాలు అందిస్తే, అవి ప్రపంచానికి ముప్పుగా మారుతున్న ఉగ్రవాదుల చేతికి చిక్కే ప్రమాదముందని పలువురు వ్యాఖ్యానించారు. అయితే, మిలిటెంట్లకు వ్యతిరేకంగా తాము చేసే పనులను పాక్ ప్రభుత్వం ప్రపంచానికి చూపాలని రిపబ్లికన్ సెనెటర్ బాబ్ కార్కర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News