: రాళ్లు రువ్వుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు!... బొమ్మరాజుపల్లిలో హైటెన్షన్
గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో నిన్న రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు చెందిన కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లెలో ఈ ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.