: మమతా కులకర్ణి నా భార్య కాదు: విక్కీ గోస్వామి


బాలీవుడ్ నటి మమతా కులకర్ణి తన భార్య కాదంటూ డ్రగ్స్ సరఫరా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ గోస్వామి సంచలన ప్రకటన చేశాడు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, ఆమెను తాను పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. విక్కీ గోస్వామి తొలిసారిగా ఒక టీవీ చానెల్ తో మాట్లాడుతూ, తాను కష్టకాలంలో ఉన్నప్పుడు మమత తనకు అండగా నిలబడిందని, తనకు శ్రేయోభిలాషి మాత్రమేనని చెప్పాడు. ఇక డ్రగ్స్ సరఫరా విషయమై తనపై వస్తున్న ఆరోపణలు సబబుకాదన్నాడు. ప్రస్తుతం తాను కెన్యాలోని మొంబాసాలో నివాసం ఉంటున్నానని, అక్కడి నుంచి తనను భారత్ కు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తోందన్నాడు. అమెరికా డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం (డీఈఏ) తనను కిడ్నాప్ చేయాలని భావిస్తోందని ఆరోపించాడు. తాను భారత్ కు వచ్చే అవకాశమే లేదని విక్కీ గోస్వామి తేల్చి చెప్పాడు.

  • Loading...

More Telugu News