: తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న ప్రాజెక్టుల‌పై కేంద్రానికి లేఖ రాస్తాం, అవసరమైతే సుప్రీంకు వెళతాం: ఏపీ ప్ర‌భుత్వం


విజ‌య‌వాడ‌లో నాలుగున్న‌ర గంట‌లుగా నిర్వ‌హిస్తోన్న‌ ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుమ‌తులు లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతోన్న ప్రాజెక్టుల‌పై కేంద్రానికి లేఖ రాయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అవ‌స‌ర‌మైతే తెలంగాణ పభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టుల‌పై సుప్రీంకోర్టుకి వెళ్లాలని నిర్ణ‌యించింది. పంట సంజీవని, ఇంకుడు గుంతలు, నీరు-ప్రగతి, రాష్ట్రంలో కొత్త పోస్టుల మంజూరు, క‌ర‌వు నివార‌ణ , అనుమ‌తులు లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోన్న ప్రాజెక్టులు తదితర అంశాల‌పై మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు. రాష్ట్రంలోని వివిధ శాఖలలో కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త‌ పోస్టుల భ‌ర్తీకి మే నెల‌లోనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది.

  • Loading...

More Telugu News