: లంచం తీసుకుంటూ ఆరోసారి పట్టుబడ్డ దహేగాం తహశీల్దార్


లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా దహేగాం తహశీల్దార్ విశ్వంబర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ అధికారులకు ఆయన దొరికిపోవడం ఇది ఆరోసారి. భూమి పత్రాల్లో పేరు మార్చేందుకని ఒక రైతు నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. సదరు రైతు ఇచ్చిన ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విశ్వంబర్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, లంచం తీసుకుంటూ పలుమార్లు పట్టుబడ్డ విశ్వరూప్ తన తీరు మార్చుకోకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News