: పుట్టిన తేదీ విషయంలో నిజాయతీగా లేకపోతే సహించబోం!: మోదీ పుట్టిన రోజు వివాదంపై దిగ్విజయ్ ట్వీట్


ప్రధాని నరేంద్ర మోదీ చదువు వివరాలు వెల్లడైన అనంతరం కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మోదీ త‌న పుట్టిన రోజు వివరాలపై స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెంట‌నే మోదీ త‌న పుట్టినరోజు వివరాలు తెల‌పాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫీస్‌పై విశ్వసనీయత, నమ్మకము ఉన్నాయ‌ని, దీనిపై స్పందించాల‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానికి చ‌దువు రాక‌పోయినా స‌రే పుట్టిన రోజుపై మాత్రం స‌రైన వివ‌రాలు తెల‌పాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము స‌హించ‌బోమంటూ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు వివరాలు తెలిపేందుకు మోదీ త‌న హై స్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్కు సంబంధించిన సర్టిఫికేష‌న్ల వివ‌రాలు తెలపాల్సిందేన‌న్నారు.

  • Loading...

More Telugu News