: ప్రేమికుడితో ప్రత్యూషను మాట్లాడనీయవద్దు: అధికారులకు సీఎంఓ ఆదేశం!
తాను ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రత్యూషను ప్రస్తుతానికి ఆ యువకుడితో కలవనీయవద్దని కేసీఆర్ కార్యాలయం అధికారుల నుంచి మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అతడితో కనీసం మాట్లాడనీయవద్దని కూడా ఆదేశించినట్టు సమాచారం. ప్రత్యూష బాగోగులు స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నందున, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకున్న తరువాతనే ముందడుగు వేయాలని అధికారులు నిర్ణయించారు. తాను ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని, అతనితో తన పెళ్లి జరిపించాలని ప్రత్యూష కోరిన సంగతి తెలిసిందే. ప్రత్యూష పెళ్లిని తానే స్వయంగా జరిపిస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు కూడా. కరీంనగర్ పర్యటన అనంతరం, ప్రత్యూష ప్రేమ విషయమై కేసీఆర్ ఓ నిర్ణయానికి రావచ్చని అధికారులు చెబుతున్నారు.