: కొత్త వివాదం... మోదీ పుట్టిన రోజుపై గందరగోళం!
భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ యూనివర్శిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేశారని, అంతకుముందు ఎంఎన్ కాలేజ్ లో ఇంటర్ లో ప్రవేశం పొందారన్న వివరాలు వెల్లడైన వేళ, ఆయన ఎప్పుడు పుట్టారన్న విషయమై కొత్త వివాదం మొదలైంది. ఇంటర్ లో చేరుతున్న వేళ, ఆయన ఆగస్టు 29, 1949లో పుట్టినట్టు దరఖాస్తులో నమోదైంది. ఇక ఎన్నికల అఫిడవిట్ లో తాను సెప్టెంబర్ 17,1950న పుట్టినట్టు మోదీ ప్రకటించుకున్నారు. ఇప్పుడదే సమస్యయింది. ప్రధాని అసలు జన్మదినం ఎప్పుడన్నది ఆయన స్వయంగా సమాధానం ఇస్తేనే తెలుస్తుంది. కాగా, రెండు రకాల పుట్టిన రోజులను ఆయన ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయమై కారణాలు తెలియజేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత శక్తిసిన్హా గోహిల్ డిమాండ్ చేశారు. ఆయన పాస్ పోర్టు, పాన్ కార్డు తదితర డాక్యుమెంట్లలో ఏ పుట్టిన రోజును చూపారో బహిర్గతం చేయాలని ఆయన అన్నారు. కాగా, మోదీ ఎంఏ డిగ్రీలో 62.3 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారని గుజరాత్ యూనివర్శిటీ ఆదివారం నాడు వివరాలు అందించిన సంగతి తెలిసిందే.