: ‘హోదా’ సాధించేదెలా?... కార్యాచరణ రూపకల్పనే లక్ష్యంగా మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ


రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక లోటులో చిక్కుకుంది. ఇతర రాష్ట్రాలతో లంకె పెట్టకుండా కేంద్రం... భారీగా చేయూతనందిస్తే మినహా ఇప్పుడప్పుడే ఆ రాష్ట్రం కష్టాల సుడిగుండంలో నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ఏపీకీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతుందా? అంటూ టీడీపీ సర్కారు ఆశగా ఎదురుచూసింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలే లేవని నిండు సభ సాక్షిగా పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి మొన్న తేల్చేశారు. ఈ ప్రకటన ఏపీలోని విపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీని షాక్ కు గురి చేసింది. అప్పటిదాకా మిత్రపక్ష పార్టీగా ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సైతం స్వరం పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణకు ఆయన రూపకల్పన చేస్తున్నారు. మరికాసేపట్లో విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ప్రత్యేక హోదాపై చౌధురి ప్రకటనపైనే ప్రధాన చర్చ జరగనున్నటు ప్రచారం సాగుతున్న ఈ భేటీలో నీట్ పై కోర్టును ఆశ్రయించే అంశంపైనా చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News