: వేడుకగా సుజనా కుమారుడి వివాహ విందు!... హాజరైన చంద్రబాబు, టీడీపీ నేతలు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కుమారుడు శ్రీ కార్తీక్ ఇటీవలే స్నేహను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో జరిగిన ఈ వివాహ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా పలువురు పార్టీ నేతలు, పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాజాగా నిన్న విజయవాడలో ఈ వివాహానికి సంబంధించిన విందు (రిసెప్షన్) జరిగింది. నూతన దంపతులు ఇచ్చిన ఈ విందుకు చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నిన్న విజయవాడలోనే ఉన్న చంద్రబాబు ఈ విందుకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.