: ఆ స్టింగ్ ఆపరేషన్ సీడీలో నేను ఉన్నాను: అంగీకరించిన ఉత్తరాఖండ్ మాజీ సీఎం


ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం సందర్భంగా జరిగిన స్టింగ్ ఆపరేషన్ వీడియో సీడీలో తాను కూడా ఉన్నానని ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీష్ రావత్ తొలిసారి అంగీకరించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో కలిసి హరీష్ రావత్ ఒప్పందం చేసుకున్నారని ఓ స్టింగ్ ఆపరేషన్ సీడీలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్టింగ్ ఆపరేషన్ పై హరీష్ రావత్ తొలిసారి పెదవి విప్పారు. ఆ సీడీలో తాను ఉన్నానని స్పష్టం చేశారు. ఓ జర్నలిస్టుతో మాట్లాడడం నేరమా? అప్పటికే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేతో మాట్లాడడం తప్పా? అని ఆయన నిలదీశారు. రాజకీయాల్లో తాము ఏ ఛానెల్ ను నిషేధించలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురు తిరగడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News