: నేనేమన్నా జలీల్ ఖాన్ నా! పదవుల కోసం పార్టీ మారడానికి?: జలీల్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి
విజయవాడ టీడీపీ నేత జలీల్ ఖాన్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం గడ్డితినే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి జలీల్ ఖాన్ మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు. పదవుల కోసం తాను పార్టీ మారనని ఆయన స్పష్టం చేశారు. క్లిష్ట సమయంలోనే మన కేరక్టర్ బయటపడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని ఆయన తెలిపారు. జగన్ తోనే నడుస్తానని ఆయన చెప్పారు. కాగా, త్వరలోనే శ్రీకాంత్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తున్నారని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.