: ఎంత ఎండలో ఉన్నా...పక్కనే గందరగోళంగా ఉన్నా సాయి ధరమ్ తేజ్ హాయిగా నిద్రపోతాడు: సుప్రీం దర్శకుడు
40 డిగ్రీల ఎండలో ఉన్నా సాయి ధరమ్ తేజ్ హాయిగా నిద్రపోగలడని సుప్రీం సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. సుప్రీం ప్రమోషన్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, ఎక్కడంటే అక్కడ తనకు నిద్ర పట్టేస్తుందని చెప్పాడు. తన పక్కనే ఇద్దరు మాట్లాడుకుంటున్నా నిద్రపోగలగడం తనకు దేవుడిచ్చిన వరమని అన్నాడు. రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గోవడం కారణంగా నిద్ర సరిపోయేది కాదని చెప్పాడు. అందుకే తాను షాట్ గ్యాప్ లో నిద్రపోయేందుకు ప్రాముఖ్యత ఇస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు. ఈ సందర్భంగానే సాయి నిద్ర గురించి అనిల్ కూడా ఆ విషయం చెప్పాడు. నిద్ర కంటే షూటింగ్ చాలా ముఖ్యమని, అందుకే టైంకి దానిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పాడు.