: ఐపీఓకు రానున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ లో కొంత వాటాను ఐపీఓ ద్వారా ప్రజలకు విక్రయించాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు డైరెక్టర్లు నిర్ణయించారు. ఎంత వాటాను విక్రయించేది, ఏ మేరకు నిధులను సమీకరించాలన్న విషయమై నిర్ణయం తీసుకోకపోయినా, వాటాల విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్ ముందుకు వస్తుందని బ్యాంకు ఎండీ చంద కొచ్చర్ వివరించారు. డైరెక్టర్ల సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. ప్రజలకు వాటా పంచడం తమకు ఆనందదాయకమని తెలిపారు. కాగా, హెచ్డీఎఫ్సీ బోర్డు డైరెక్టర్లు సైతం హెచ్డీఎఫ్సీ లైఫ్ లో వాటాలను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News