: ఐపీఎల్ లో దూకుడుగా ఆడటం సాధ్యపడట్లేదు: యువరాజ్ సింగ్
టీమిండియా తరఫున వన్డేల్లో రాణించిన తాను ఐపీఎల్ లో దూకుడుగా ఆడలేకపోతున్నానని క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు కారణం, ఐపీఎల్ లో ఒకే టీంలో ఉండకపోవడమేనని అంటున్నాడు. టీంలు మారడం వల్లే తాను రాణించలేకపోతున్నానని తేల్చి చెప్పాడు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తానని, ఆ ధీమా మాత్రం కోల్పోలేదని యువరాజ్ చెప్పాడు. కాగా, 2008-10 మధ్య పంజాబ్ జట్టులో, 2011-13 మధ్య పూణె జట్టులో, 2014 లో బెంగళూరు జట్టులో, 2015 లో ఢిల్లీ జట్టు, ప్రస్తుతం హైదరాబాద్ తరపున యువరాజ్ ఆడుతున్న విషయం తెలిసిందే.