: ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో రూ.530 కోట్ల పనులకు ఏపీ సర్కార్ ఆమోదం


విజయవాడ సమీపంలోని వెలగపూడిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయంలో రూ.530 కోట్ల పనులకు ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. రెండు, మూడు ఫ్లోర్ల నిర్మాణానికి రూ.68.34 కోట్లు, అంతర్గత మౌలిక సదుపాయాలకు రూ.355.74 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.105.92 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జీప్లస్-1 గా సచివాలయ నిర్మాణం, హెచ్డీవోలకు అదనంగా మరో రెండు ఫ్లోర్లు నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 45 ఎకరాల్లో 27 ఎకరాల్లో భవనాలు, 18 ఎకరాల్లో పార్కింగ్ కు కేటాయించినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. జూన్ 2016 నాటికి జీ ప్లస్ అంతస్తుల భవన నిర్మాణం పూర్తి చేయాలని, అంతర్గత మౌలిక సదుపాయాలకు ఇప్పటికే కొలతలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News