: పవన్ కల్యాణ్ గారు ఒక్కరు రోడ్డుపైకి వస్తే చాలు, సమస్య పరిష్కారమవుతుంది: హీరో శివాజీ


‘ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వారందరూ దేశద్రోహులేనా? ఈ రోజున పవన్ కల్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు.. ఆయన కూడా దేశద్రోహేనా?’ అంటూ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, హీరో శివాజీ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయమై ఒక ఛానెల్ శివాజీ అభిప్రాయం కోరగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ స్పందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. పవన్ చాలా కచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పారని, అధికార, ప్రతిపక్ష నేతలందరూ మీనమేషాలు లెక్కపెడుతున్నారని, ప్రత్యేక హోదాపై పవన్ చొరవ చూపాలని, బహిరంగ సభ పెట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ ఒక్కరు రోడ్డుపైకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా సమస్యకు పరిష్కారం నాలుగు నెలల్లో లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం అని, దేశం చక్కగా ఉండాలంటే రాష్ట్రాలు కూడా బాగుండాలని అన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించిన తనపై దేశద్రోహం కేసు పెట్టాలనుకోవడంపై శివాజీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News