: గోవాలో దారుణం.. రష్యా యువతి నిద్రిస్తుండగా అత్యాచారం చేసిన గెస్ట్ హౌస్ యజమాని
గోవా అందాలను సందర్శించడానికి వచ్చి అక్కడి వసతి గృహంలో బసచేస్తోన్న ఓ రష్యా యువతిపై అత్యాచారం జరిగింది. నిన్న తన రూమ్‌లో ఆ యువతి నిద్రిస్తుండగా గమనించిన వసతి గృహం యజమాని ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను నిద్రిస్తుండగా వసతి గృహ యజమాని జేమ్స్ డిసౌజా తనపై అత్యాచారం జరిపినట్లు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.