: బెజవాడలో సీఎం ఆఫీస్ వాహనం బీభత్సం!... వ్యక్తిని ఢీకొట్టి కిలో మీటరు మేర ఈడ్చుకెళ్లిన వైనం


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కార్యాలయ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఓ పక్కగా నడుచుకుంటూ వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లిన ఆ వాహనం ఇద్దరు వ్యక్తులను తీవ్ర గాయాలపాల్జేసింది. పాదచారులపైకి దూసుకెళ్లిన సదరు వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా... అతడిని కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సదరు వ్యక్తితో పాటు మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారి ప్రాణాలను కాపాడారు. నగరంలోని కంకిపాడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News