: డెలావేర్‌లో ఘనంగా ప్రారంభ‌మైన‌ 'గోదావరి'


డెలావేర్‌, యూఎస్ఏ, ఏప్రిల్ 29, 2016: ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న గోదావరి పెద్ద ఎత్తున అతిథుల కోలాహాలం మధ్య డెలావేర్ ప్రావిన్స్‌లోని విల్మింగిట‌న్‌లో ఏప్రిల్ 16న ప్రారంభ‌మైంది. అతిథుల అభిమానాలు చూరగొన్న సౌత్ ఇండియన్ అథెంటిక్‌ క్విజిన్ రెస్టారెంట్ గోదావ‌రి ఈ ప్రారంభ కార్య‌క్ర‌మంలోనే అతిథుల‌కు చవులూరించే బ‌ఫెట్‌ను అందించింది. అనేక విశిష్ట‌త‌లు క‌లిగి ఉన్న గోదావరిలో వెజిటేరియ‌న్ వెరైటీలు అతిథుల‌కు నోరూరించేలా ఉన్నాయి. ‘విద్యాబాల‌న్ వ‌డ‌లు’, ‘గోంగూర ఇడ్లీ’, ‘ప‌రిటాల పైనాపిల్ ర‌సం’, ‘కుండ పెరుగు’ వంటి విశిష్ట మెనూ ఇందులో ప్ర‌ముఖ‌మైన‌వి. నాన్‌వెజ్ వెరైటీల్లో భాగంగా ‘కేటీఆర్ కోడి రోస్ట్‌’, ‘ఊర్మిళ ఉర‌గాయ మాంసం’, ‘ర‌త్త‌మ్మ‌గారి రొయ్య‌ల ఇగురు’, ‘పిఠాపురం పీత‌ల పులుసు’ వంటివెన్నో కొలువుదీరాయి. గోదావ‌రి డెలావేర్ ఫ్రాంచైజీ ప్ర‌తినిధులు మోహ‌న్ తుమ్మ‌ల‌, గోపి చిగురుపాటి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గోదావ‌రి కుటుంబంలో తాము చేర‌డం అత్యంత సంతోష‌క‌రంగా ఉంద‌న్నారు. డెలావేర్లో అథెంటిక్ సౌత్ ఇండియా రుచులను ఆస్వాదించేందుకు గోదావ‌రి స‌రైన వేదిక అని వివ‌రించారు. 150 సీట్ల విశాల‌మైన స్థ‌లంలో కొలువుదీరిన గోదావ‌రి డెలావేర్ రెస్టారెంట్‌లో అత్యుత్త‌మ చారిత్ర‌క నేప‌థ్యంతో పాటు ద‌క్షిణాది రుచులు విశేషంగా అందుబాటులో ఉంచారు. ఈ ఫ్రాంచైజీ పొంద‌డం ప‌ట్ల యాజ‌మాన్యం స్పందిస్తూ “కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు, బామ్మ‌-తాతయ్య ఊరు తాలుకు మ‌ధుర‌మైన వంట‌కాలు, అత్యుత్త‌మ ఆతిథ్య వేదిక‌గా పొందేలా గోదావ‌రిని తీర్చిదిద్దాం” అని తెలిపారు. గోదావ‌రి విస్త‌ర‌ణ గురించి తేజా చేకూరి, కౌశిక్ కోగంటి వివ‌రిస్తూ ‘గోదావ‌రి పేరుతో భార‌తీయ వంట‌కాల‌ను ముఖ్యంగా ద‌క్షిణాది ఆహార, ఆతిథ్యాల‌ను అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో విస్త‌రించ‌డం చాలా సంతోషంగా ఉంది. మేం టీం గోదావ‌రి పేరుతో నిరంతరం శ్ర‌మిస్తూ వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త రుచుల‌ను, చవులూరించే వంట‌కాల‌ను గోదావ‌రి ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందిస్తున్నాం’ అని తెలిపారు. గోదావ‌రి డెలావేర్‌కు ఫైనాన్షియ‌ల్ ఆఫీస్ హ‌బ్‌, ఫ్రాక్షిమిటీ 1-95కి అత్యంత స‌మీపంలో ఉంది. అత్యంత కీల‌క‌మైన ప్రాంతంలో ఉండ‌టం వ‌ల్ల ఫిల‌డెల్ఫియా, కింగ్ ఆఫ్ ప్ర‌ష్యా, ఎక్ట్సన్ అనుబంధ న‌గ‌రాల‌కు అత్యుత్త‌మ సేవ‌లను అతిథులకు అందించేందుకు వీలు చిక్కుతుంది. గోదావ‌రి గ్రూప్ త్వ‌ర‌లో త‌న విశ్వ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారుల‌కు సేవ‌లు అందించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో, తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కార్పొరేట్ కార్యాల‌యాల‌ను ఏర్పాటుచేయ‌నుంది. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో దాదాపు 2000కు పైగా అతిథుల జీఎంఏటీఏ(మ్యాడిస‌న్‌), టీఏజీబీ(బోస్ట‌న్‌)ల‌లో ఆతిథ్యం అందించింది. గోదావ‌రి మేరీలాండ్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసినందుకు మెట్రో వాషింగ్ట‌న్ ప్ర‌జ‌ల‌కు గోదావ‌రి గ్రూప్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతోంది. గోదావ‌రి మేరీలాండ్ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మ వీడియోను ఈ లింక్‌లో చూడ‌వ‌చ్చు: https://www.youtube.com/watch?v=ffro7phkAFE గోదావ‌రిని నిరంత‌రం ఆద‌రిస్తూ వివిధ ప్రాంతాల్లో త‌మ అతిథుల‌కు చ‌క్క‌టి వంట‌కాల‌ను అందించే అవ‌కాశం క‌ల్పిస్తున్న వారంద‌రికీ పేరుపేరునా గోదావ‌రి ధ‌న్య‌వాదాలు తెలుపుతోంది. ఇంతేకాకుండా గోదావరి రెస్టారెంట్ ద్వారా తెలుగు వంటకాలను #GoogleofIndianFood మరియు #IncredibleIndianFood పేరుతో హ్‌ష్ ట్యాగ్‌లు సృష్టించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం క‌ల్పిస్తోంది. గోదావరి డెలావేర్ వారు ఈ ‌”‌MOTHERS డే” నాడు ప్రత్యేక వారాంతపు మధ్యాహ్నవిందుని మాతృత్వపు మాధుర్యాన్ని మేళవించి మీకు అందిస్తున్నారు. అమ్మ చేతి వంటింటి రుచుల కమ్మదనం, ఘుమఘుమలు ఈ ”‌MOTHERS డే” వీకెండ్ సమయంలో ఏదైనా గోదావరి రెస్టారంట్లో ఆస్వాదించండి. మీకిదే మా అపురూప స్వాగతం!!! డెలావేర్ గోదావ‌రిని ప్ర‌తి ఒక్క భోజ‌న ప్రియుడికి ఆహ్వానం ప‌లుకుతూ గోదావ‌రి ప్ర‌త్యేక‌త‌ల‌ను నిల‌బెట్టుకుంటుంద‌ని భావిస్తున్నాం. చిరునామా: గోదావ‌రి డెలావేర్ 3615 కిర్క్‌వుడ్‌, విల్మింగ్ట‌న్, డెలావేర్ 19808. ఫోన్‌: 302-999-0286 మ‌రోమారు మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. సంప్రదించండి: స‌తీశ్ చ‌ల‌సాని DELAWARE@GODAVARIUS.COM Ph: 248-719-8795 www.Godavarius.com Press note released by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News