: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు: కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి


ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని అంశాలన్నింటినీ నీతిఆయోగ్ అధ్యయనం చేస్తోందని, ఏపీకి ఆర్థిక సాయంపై నీతి ఆయోగ్ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం చెప్పినట్లు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.2,050 కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.750 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News