: మధ్యాహ్న సమయాల్లో ఉపాధి హామీ పనులు ఆపివేయాలి: సీఎం కేసీఆర్


ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్న సమయాల్లో ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో కలెక్టర్లతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కరవు సహాయక చర్యలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్యాహ్న సమయంలో ఉపాధి హామీ పనులు నిలిపివేయాలని, గ్రామాలు, పట్టణాల్లో వడదెబ్బ నివారణ మందులు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ సూచించారు. ఎవరైనా తిండిలేక ఇబ్బందిపడితే తక్షణమే స్పందించాలని కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు. పశువులకు అవసరమైనంత పశుగ్రాసం అందజేయాలని, ఖరీఫ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, పత్తికి మార్కెట్ ఉండదని, ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలని, సోయాబీన్ లాంటి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. పత్తి ఎగుమతులపై ఉన్న పన్ను రాయితీని ఉపసంహరించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News