: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూతురు మృతి
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె కర్ణిక సింగ్ అనారోగ్యం కారణంగా మృతి చెందింది. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు తరలించనున్నారు. కాగా, గత ఏడాది యూఎస్ లో కర్ణిక సింగ్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. దిగ్విజయ్ సింగ్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. దిగ్విజయ్ భార్య ఆశా 2013లో మృతి చెందారు. అనంతరం దిగ్విజయ్ టీవీ యాంకర్ అమృతారాయ్ ని వివాహం చేసుకున్నారు.