: అగస్టా స్కాంలో... మీడియాకూ అంటిన మకిలీ!: లోక్ సభలో బీజేపీ ఎంపీ లేఖీ సంచలన ఆరోపణ


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ నేతలను ఇరుకున పడేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో భారత మీడియాకూ మకిలి అంటిందట. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ నిన్న సంచలన ఆరోపణ చేశారు. భారత్ కు తన హెలికాప్టర్లను అంటగట్టేందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ రాజకీయ నేతలతో పాటు మీడియాను మచ్చిక చేసుకునేందుకు భారీగానే ధనాన్ని వెచ్చించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్... మీడియాను మేనేజ్ చేసేందుకు ఏకంగా రూ.50 కోట్ల మేర ఖర్చు చేసినట్లు లేఖీ ఆరోపించారు. అవినీతిపై సమరం చేయాల్సిన మీడియానే ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరమని లేఖీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News