: మండుటెండలో కఠోర శిక్షణ... వరంగల్ పీటీసీలో హెడ్ కానిస్టేబుల్ బుచ్చిరెడ్డి మృతి


వరంగల్ సమీపంలోని మామునూరు పోలీస్ శిక్షణా కేంద్రం (పీటీసీ)లో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. మండుటెండలో శిక్షణ పొందుతూ హెడ్ కానిస్టేబుల్ బుచ్చిరెడ్డి మరణించాడు. వివరాల్లోకెళితే... హెడ్ కానిస్టేబుళ్లకు ఏటా నిర్వహించే శిక్షణా తరగతుల్లో భాగంగా మామునూరు పీటీసీలో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపునకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పలువురు హెడ్ కానిస్టేబుళ్లు హాజరయ్యారు. మండుటెండను కూడా పరిగణనలోకి తీసుకోని ఉన్నతాధికారులు శిక్షణను కొనసాగించారు. ఈ క్రమంలో ఫైరింగ్ లో తర్ఫీదు పొందుతున్న బుచ్చిరెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ భానుడి ప్రతాపానికి తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకులాడు. సహచర కానిస్టేబుళ్లు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన చనిపోయాడు.

  • Loading...

More Telugu News