: బెంగళూరులో తెలంగాణ మంత్రులు.. రాజోలిబండ నీటి మళ్లింపు పథకంపై కర్ణాటక మంత్రితో కాసేపట్లో భేటీ
రాజోలిబండ నీటి మళ్లింపు పథకంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి బెంగళూరు చేరుకున్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో రాజోలిబండ నీటి మళ్లింపు అంశంపై కీలక చర్చలు జరపనున్నారు. దీనిలో భాగంగా మంత్రులు కొద్దిసేపట్లో కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తో వీరు భేటీ కానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీరందించే రాజోలి బండ వాటర్ డైవర్షన్ స్కీం వివాదంలో రైతులు నానా ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు కేటాయించిన నీటి కంటే అతి తక్కువ శాతంలో నీరు లభిస్తోన్న నేపథ్యంలో వాటర్ డైవర్షన్ స్కీం పనులు సమర్థవంతంగా నిర్వహించడానికి మంత్రులు చర్చలు జరపనున్నారు.