: బుడ్డా రాజశేఖరరెడ్డి... నిజంగా ‘స్పీడున్నోడే’!


కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన బుడ్డా రాజశేఖరరెడ్డి... నిజంగా ‘స్పీడున్నోడు’గానే పేరు తెచ్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగానే కాక ఆ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ గా కూడా ఉన్న బుడ్డా... వైసీపీకి రాజీనామా చేసేసి నేడు టీడీపీలో చేరనున్నారు. 35 బస్సుల నిండా తన కార్యకర్తలతో నిన్న రాత్రే విజయవాడకు బయలుదేరిన బుడ్డా... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బుడ్డా... పార్టీ మారుతున్న క్రమంలో తన ఫేస్ బుక్ ఫ్రొఫైల్ ను మార్చేశారు. పార్టీ మార్పిడికి ఒక రోజు ముందుగానే ఆయన ఈ దిశగా నిర్ణయం తీసుకుని నెటిజన్లతో ‘స్పీడున్నోడు’గా పిలిపించుకున్నారు. మొన్నటిదాకా ఫేస్ బుక్ లో వైసీపీ నేతగా కనిపించిన ఆయన... నిన్న ఉన్నట్టుండి టీడీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఫేస్ బుక్ లోని తన హోం పేజీలో తన ఫోటో వెనుక ఉన్న వైసీపీ రంగును తీసేసిన బుడ్డా... దానిని టీడీపీ రంగు ‘పసుపు’తో రంగులద్దారు. అంతేకాక తనను తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన పరిచయం చేసేసుకున్నారు.

  • Loading...

More Telugu News