: సిమెంట్ ఫ్యాక్ట‌రీ అనుమ‌తి కోసం పార్టీని వీడాల్సిన అవ‌స‌రం లేదు!: మైసూరారెడ్డి


వైఎస్సార్ సీపీకి రాజీనామా చేస్తూ.. ఆ పార్టీ అధినేత‌కు ఈరోజు నాలుగు పేజీల లేఖ‌ను రాసిన మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి.. జగన్ స్పందన తరువాతే తాను ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. తన రాజీనామా ప్ర‌క‌ట‌న అనంత‌రం వైసీపీ నేత‌లు త‌న‌పై చేస్తోన్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వమ‌ని అన్నారు. సిమెంట్ ఫ్యాక్ట‌రీ అనుమ‌తి కోసం పార్టీని వీడాల్సిన అవ‌స‌రం లేదని తెలిపారు. తాను వైసీపీని వీడుతున్న‌ది రాజ్యస‌భ సీటు ఇవ్వలేద‌నే కార‌ణంతో కూడా కాద‌ని తెలిపారు. మ‌రోవైపు, పార్టీ వీడుతున్న‌ట్లు రాజీనామా లేఖ పంపిన‌ మైసూరారెడ్డిపై ఢిల్లీలో స్పందించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మైసూరా రెడ్డి పార్టీకి దూరమై చాలా రోజులు అయిందని, ఆయ‌న‌ను చూసే ఆరు నెలలు అవుతోందని కొద్దిసేప‌టి క్రితం వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News