: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 58.62 పాయింట్లు లాభపడి 26,064.12 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17.25 పాయింట్లు లాభపడి 7,979.90 పాయింట్ల వద్దకు చేరింది. ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్ సంస్థ షేర్లు అత్యధికంగా 5.37 శాతం లాభపడి రూ.241.40 వద్ద ముగిశాయి. ఈ సంస్థ షేర్లతో పాటు భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, భారతీ ఇన్ ఫ్రాటెల్ సంస్థల షేర్లు లాభాలు దక్కించుకున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అత్యధికంగా 3.42 శాతం నష్టపోయి రూ.245.35 వద్ద ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్ బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా పవర్ సంస్థల షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.45 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News