: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు
ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కరవు నివారణ చర్యలు తీసుకోవాలంటూ పలు జిల్లాల్లోని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది. తెలంగాణలో ఉన్న కరవు పరిస్థితిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సూచిస్తోంది. పలు జిల్లాల్లో రాష్ట్ర మంత్రుల దిష్టి బొమ్మలు దహనం చేసినట్లు సమాచారం. రెవెన్యూ ఆఫీస్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరవు నివారణ చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రాలను అందించారు.