: టేకాఫ్ కు ముందు విమానంలో రోజా సెల్ఫీల సందడి!


‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంలో భాగంగా నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. నిన్న ఉదయమే హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న వారంతా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న స్పైస్ జెట్ విమానాన్ని ఎక్కేశారు. అంతా తమకు కేటాయించిన సీట్లలో కూర్చోగా... వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం హల్ చల్ చేశారు. సీట్ల వరుసల మధ్య నిల్చుని చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగారు. అయితే ఆ తర్వాత ఆమెతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా భయంతో వణికిపోయారు. టేకాఫ్ తీసుకున్న విమానం వెనువెంటనే మళ్లీ తిరిగి వెనక్కు వచ్చేసింది. టేకాఫ్ తీసుకున్నట్టే తీసుకుని ల్యాండ్ కావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. తామెక్కిన విమానంలో సాంకేతిక లోపం ఉందన్న విషయం తెలుసుకున్న వారంతా భయపడిపోయారు. అయితే సకాలంలో స్పందించిన పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రోజా సెల్ఫీ తీసుకున్న ఫొటోలు నేటి ఉదయం పలు వార్తా చానెళ్లలో ప్రసారమయ్యాయి.

  • Loading...

More Telugu News