: బోయపాటి నాతో తీస్తాడని ఎక్స్ పెక్ట్ చెయ్యను... మా అబ్బాయితో తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తాను: సినీ నటుడు శ్రీకాంత్
‘నన్ను హీరోగా పెట్టి దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా తీస్తాడని నేను ఎక్స్ పెక్ట్ చెయ్యను. కానీ, మా అబ్బాయితో సినిమా తీస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తాను’ అని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అన్నారు. ‘సరైనోడు’ చిత్రం సక్సెస్ మీట్ హైదరబాద్ లో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ మాట్లాడుతూ, గతంలో తాను నటించిన రెండు చిత్రాలకు బోయపాటి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారని అన్నారు. బోయపాటి పెద్ద డైరెక్టర్ అవుతాడని అప్పుడే అనుకున్నానని అన్నారు. అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే డైలాగ్ లు రాసేవారని అన్నారు. బోయపాటి డైరెక్టర్ అయిన తర్వాత తనను హీరోగా పెట్టి సినిమా తీస్తాడేమోనని నాడు అనుకున్నానని అన్నారు. తనను హీరోగా పెట్టి సినిమా తీస్తాడని ఇప్పుడు మాత్రం ఎక్స్ పెక్ట్ చెయ్యనని, తన కొడుకుతో బోయపాటి సినిమా తీస్తాడని మాత్రం ఎక్స్ పెక్ట్ చేస్తానని శ్రీకాంత్ నవ్వుతూ అన్నారు.